యథాతథస్థితి ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ : ఉపాధ్యాయుల అంతర్ జిల్లాల బదిలీల నిమిత్తం జారీ చేసిన జీవో 21కి సవరణలను నిలుపుచేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 19న సవరణలపై జారీ చేసిన జీవో 402ను సవాల్ చేస్తూ వ్యాజ్యాలు దాఖలైన సంగతి తెలిసిందే. కే తిరుపతిరెడ్డి సహా 10 మంది దాఖలు చేసిన రిట్లపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. యథాతథస్థితి కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 6కు వాయిదా వేస్తున్నామని తెలిపారు.