హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : ఈ విద్యాసంవత్సరం కూడా ఇదే పునరావృతమయ్యింది. రాష్ట్రంలో 7,364 బడుల్లో టీచర్ల కొ రత ఉండగా, మరోవైపు 21వేల మంది మిగులు టీచర్లున్నట్టు విద్యాశాఖ లెక్కతేల్చింది. టీచర్ల కొరత సమస్యను నివారించేందుకు సర్ప్లస్ టీచర్ల సర్దుబాటును విద్యాశాఖ పూర్తిచేసింది. రాష్ట్రంలో 24,227 సర్కారు స్కూళ్లున్నాయి. వీటిల్లో మొత్తం 1,04,605 మంది టీచర్లు పనిచేస్తున్నారు. పోస్టులను ప్రామాణికంగా తీసుకోకుండా విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లను కేటాయిస్తున్నారు. విద్యార్థులుంటేనే ఆయా బడులకు టీచర్లను ఇస్తున్నారు. దీంతో టీచర్లను సర్దుబాటుచేసేందుకు విద్యాశాఖ జీవో-25ను జారీచేసింది. ఈ సర్దుబాటులో అనేక విషయాలు వెల్లడయ్యాయి.
సర్దుబాటు చేశారిలా..