TS TET | రాయితీకి రాం రాం.. టెట్ ఫీజులో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం
ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫీజులను భారీగా పెంచిన సర్కారు.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించింది. ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులపై మోయలేని భారాన్ని మోపింది.
- టెట్‌లో మినహాయింపు ఇవ్వని సర్కారు
- ఎప్‌సెట్ సహా అన్ని పరీక్షల్లోనూ అమలు
- సీటెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు కేంద్రం రాయితీ
- 150 నుంచి 300 శాతం మేర ఫీజుల పెంపు
- ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్న విద్యార్థులు
TS TET | హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫీజులను భారీగా పెంచిన సర్కారు.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించింది. ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులపై మోయలేని భారాన్ని మోపింది. రాజ్యాంగసూత్రాలకు విరుద్ధంగా, రిజర్వుడ్ విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించకుండా జనరల్ క్యాటగిరీ విద్యార్థులతో సమానంగా ఒకే తరహా ఫీజులను అమలుచేస్తున్నది. అదే జాతీయంగా నిర్వహిస్తున్న సీటెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు సీబీఎస్ఈ ఫీజు రాయితీని అమలు చేస్తున్నది.
మన రాష్ట్రంలో ఎప్‌సెట్, ఐసెట్ వంటి ప్రవేశ పరీక్షల్లోనూ ఫీజుల రాయితీని అమలు చేస్తున్నారు. కానీ టెట్‌లో మాత్రం రాయితీ ఇవ్వడం లేదు. దీనిపై ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేశారు. ఆదివారం గద్వాల జిల్లాలో టెట్ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. టెట్ ఫీజును తగ్గించాలని, పాత ఫీజుల విధానాన్నే కొనసాగించాలని వారంతా ప్రతినబూనారు.
150 నుంచి 300 శాతం మేర పెంపు
టెట్ ఫీజులను ఇటీవలే ప్రభుత్వం భారీగా పెంచింది. నిరుడు ఒక పేపర్ రాసినా, రెండు పేపర్లు రాసినా రూ.400 మాత్రమే ఫీజు తీసుకోగా, ఈ ఏడాది ఒక పేపర్‌కు రూ.1,000, రెండు పేపర్లకు రూ.2,000 ఫీజుగా ఖరారు చేశారు. ఈ ఫీజులు సీబీఎస్ఈ నిర్వహించే సీటెట్‌తో పోల్చితే 300 శాతం అధికంగా ఉండటం గమనార్హం. సీటెట్కు జనరల్ క్యాటగిరీ అభ్యర్థుల నుంచి ఒక పేపర్‌కు రూ.1,000, రెండు పేపర్లకు 1,200 మాత్రమే తీసుకుంటున్నారు.
- ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎప్‌సెట్‌లో జనరల్ విద్యార్థులకు ఒక పేపర్‌కు రూ.900, రెండు పేపర్లకు రూ.1,800 వసూలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థుల నుంచి ఒక పేపర్‌కు రూ.500, రెండు పేపర్లకు రూ.1,000 మాత్రమే ఫీజుగా తీసుకుంటున్నారు.
- ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్‌లో జనరల్ విద్యార్థులకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థులకు రూ.550 చొప్పున ఫీజులు తీసుకుంటున్నారు.
ఫీజుల్లేకుండా దరఖాస్తులు స్వీకరించాలి
నిరుద్యోగుల నుంచి రూపాయి ఫీజు తీసుకోకుండా దరఖాస్తులు స్వీకరిస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పొందుపరిచింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజుల పేరుతో నిరుద్యోగుల నడ్డి విరుస్తోంది. టెట్ ఫీజుల పెంపు మరీ దారుణం. ఎన్నికల హామీని నిలబెట్టుకొని తక్షణమే రూపాయి ఫీజు లేకుండా దరఖాస్తులు స్వీకరించాలి. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తాం.
– జంగయ్య, రాష్ట్ర కార్యదర్శి, బీఆర్ఎస్వీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

