Katragadda Prasuna | హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు కాట్రగడ్డ ప్రసూన పేర్కొన్నారు. కేసీఆర్ పట్ల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఇవాళ వార్త పత్రికల్లో చదివి చాలా బాధపడ్డాను అని ఆమె తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం సాధించడంలో అన్ని పార్టీలను కలుపుకొని ముందుకుపోయి తెలంగాణ రాష్ట్రంను సాధించిన వ్యక్తి కేసీఆర్ అని గుర్తు చేశారు. నేను 18 ఏండ్లు ఆయనతో కలిసి పని చేశాను. తెలంగాణ స్వాతంత్ర్య ఉద్యమంలో కేసీఆర్ పాత్ర మరువలేనిది. ఇవాళ ముఖ్యమంత్రి తాగుబోతు అన్న పదం నన్ను చాలా బాధించింది. వ్యక్తిగత విషయాలను రాజకీయాలకు ముడిపెట్టడం సరైంది కాదు అని కాట్రగడ్డ ప్రసూన పేర్కొన్నారు.
ఒక్క కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా అందరి మన్ననలు పొందిన వ్యక్తి మేధావి కేసీఆర్. ఎన్నో ఉపన్యాసాలు విన్నాను. ఆయన ఉపన్యాసాలు సామాన్యులను ప్రభావితం చేస్తాయి. గొప్ప వ్యక్తి కేసీఆర్ అని ఆమె కొనియాడారు.
నా పార్టీ ఏదైనా కానీ పార్టీలతో పని లేకుండా నేను కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడిన పదజాలన్ని చూసి సిగ్గుతో తల వంచుకుంటున్నాను. రాజకీయాలు అంటే ఇంత హీనంగా ఉండాలా..? ఇంత దిగజారి మాట్లాడం దేనికి సంకేతం.. పథకాలతో అభివృద్ధిలో పోటీపడాలి. కొత్త పథకాలు ఇచ్చి రాజకీయాలు చేయాలి కానీ ఇలాంటి సిగ్గుమాలిన మాటలతో రాజకీయాలు చేయద్దు అని కాట్రగడ్డ ప్రసూన హెచ్చరించారు.
కేసీఆర్ తాగుబోతు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ పాత్ర మరువలేనిది
తెలంగాణ రాష్ట్రం సాధించడంలో అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రంను సాధించిన వ్యక్తి కేసీఆర్
నేను… https://t.co/UG6PyCO3a7 pic.twitter.com/nFC1OCuW8M
— Telugu Scribe (@TeluguScribe) March 17, 2025