40 లక్షల టన్నుల బొగ్గు ఏమైంది?.. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి
సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు ఏమైందని, నిల్వలు చూపించడానికి యాజమాన్యం ఎందుకు భయపడుతున్నదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ప్రశ్నించారు.
- నిల్వలు చూపించడానికి మీకు భయం ఎందుకు?
గోదావరిఖని, జూన్ 24: సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు ఏమైందని, నిల్వలు చూపించడానికి యాజమాన్యం ఎందుకు భయపడుతున్నదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ప్రశ్నించారు. బొగ్గు ఏమైందని ప్రశ్నిస్తే యాజమాన్యం ఉలిక్కిపడుతున్నదని అన్నారు. అధికారులు వాస్తవాలు వెల్లడించకుండా ఊకదంపుడు ప్రెస్మీట్లు నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బొగ్గు రవాణాలో లోపాలు ఉన్నాయని, అక్రమ రవాణా జరిగిందని బీఆర్ఎస్ గానీ టీబీజీకేఎస్ ఎక్కడా ఆరోపించలేదని అన్నారు. తాము 40 లక్షల టన్నుల బొగ్గు లెక్కలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నామని తెలిపారు.
అసలు విషయాన్ని పక్కనపెట్టి సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తూ కార్మికులను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించడం సరికాదని అన్నారు. బొగ్గు పక్కదారి పట్టలేదని చెప్తున్న అధికారులు, సంబంధిత బొగ్గు నిల్వల వివరాలను బహిరంగంగా చూపించడానికి సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సంబంధిత బొగ్గు పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెంట్లు, పన్నులు, కోల్సెస్, సీఎస్ఆర్, డీఎంఎఫ్ నిధులు, తదితర అంశాల కింద వందల కోట్ల రూపాయలు అడ్వాన్స్ పన్నులు చెల్లించారని పేర్కొన్నారు.
అయినప్పటికీ కొన్ని కార్మిక సంఘాలు యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నాయని విమర్శించారు. బొగ్గు అంశాన్ని ప్రస్తావిస్తే సింగరేణి ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పడం సరైన విధానం కాదని సూచించారు. సంస్థను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే ప్రమాదాల గురించి తాము మాట్లాడుతున్నామని చెప్పారు. సంస్థ లేకపోతే ప్రతిష్ట అనే ప్రశ్న ఎక్కడ ఉంటుందని ఆయన వాఖ్యానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

