ధర్మసాగర్, నవంబర్ 14: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం, దేవునూర్ గ్రామాల శివారులో ఆక్రమణకు గురవుతున్న అటవీ భూములపై కలెక్టర్ సమ గ్ర విచారణ చేపట్టాలని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. గురువారం ధర్మసాగర్ మండలం ముప్పారంలో మాజీ ఎంపీటీసీ మేకల విజయ్‌కుమార్ ఆధ్వరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన త ర్వాత ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య భర్త నజీర్, వారి అనుచరులు అటవీ భూములను ఆక్రమించుకుంటున్నార ని ఆరోపించారు.
హనుమకొండ జిల్లాలో ఉన్న ఏకైక రిజర్వ్ ఫారెస్ట్ ధర్మసాగర్, వేలేరు, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో విస్తరించి ఉందని, దీనిని కాపాడుకోవాలని పేర్కొన్నారు. కడియం కుటుంబసభ్యులు తప్పుడు సర్వే నంబర్లతో పట్టా పాసు పుస్తకాలు పొంది ఫారెస్ట్ భూములను కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి నుంచి కలెక్టర్‌కు లేఖలు పంపించి రెవెన్యూ అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఫారెస్ట్ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు.
అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కర్ర సోమిరెడ్డి, నాయకులు లాల్ మహ్మద్, శ్రీనివాస్, వేలేరు మండల బీఆర్ఎస్ నాయకులు ఇట్టబోయిన భూపతిరాజ్, రాజు, తిరుపతి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.