హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలన్న ప్రధాన డిమాండ్‌తో జూలై 4 నుంచి రాష్ట్రవ్యాప్త నిరసనలకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) పిలుపు ఇచ్చింది. 10 డిమాండ్లను నెరవేర్చాలని ఆందోళనకు దిగనున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వోద్నాల రాజశేఖర్, ప్రధానకార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య శనివారం ప్రకటించారు.
జూలై 4న మండలం, స్కూల్ కాంపెక్ల్స్ స్థాయిలో ధర్నా, జూలై 14న జిల్లా స్థాయిలో ధర్నా, 22న రాష్ట్రస్థాయి ధర్నా చేపట్టనున్నామని తెలిపారు. పీఆర్సీ నివేదికను తెప్పించుకుని, 51% ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని, 2003 డీఎస్సీ టీచర్లకు సీపీఎస్ రద్దు, పాత పింఛన్ పునరుద్ధరణ, మాడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు, కేజీబీవీ మహిళా టీచర్లకు మినిమం టైం స్కేల్ వంటి డిమాండ్ల పరిష్కారానికి ఆందోళనకు పిలుపు ఇచ్చినట్టు వారు తెలిపారు.