హైదరాబాద్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో వివిధ రాష్ర్టాల్లో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మోటరు వాహన చట్టం-2019, టూరిస్టు పర్మిట్ విధానాల అమలు, బల్క్ బయ్యర్స్‌కు సబ్సిడీ తొలగింపు, గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో విద్యుత్తు బస్సులను ప్రవేశపెట్టడం, నాలుగు కార్మిక కోడ్ల కారణంగా ఆర్టీసీలు కుదేలు అవుతున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆర్టీసీని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.