హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : ఆదివాసీల సాగుభూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు తీసుకొచ్చిన జీవో-49ను వెంటనే రద్దు చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టైగర్ రిజర్వ్ కారిడార్ పేరు తో ఆదివాసీలు సాగుచేస్తున్న భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవో-49ని తీసుకొచ్చాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలోని 4లక్షల ఎకరాలను అదానీకి అప్పజెప్పిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చి న హామీలు అమలు కాలేదని, పోడు సాగుదారులపై అటవీ అధికారులతో దాడులు చేయిం చి కేసులు పెడుతున్నదని విమర్శించారు.