నవీపేట, అక్టోబర్ 9 : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తామంతా బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ వెంటే ఉంటామంటూ నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం రాంపూర్ యువకులు ప్రకటించారు.
అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న షకీల్‌ను రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని వారు స్పష్టం చేశారు. అన్ని గ్రామాల కన్నా రాంపూర్‌లోనే భారీ మెజారిటీ ఇస్తామని వారు పేర్కొన్నారు.