నల్లగొండ: మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి ఓటమి భయంతో అర్ధరాత్రి కొత్త డ్రామా మొదలు పెట్టారని టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ధ్వజమెత్తారు.
ప్రశాంతంగా జరిగే ఎన్నికల్లో విద్వేషాలు సృష్టించి అల్లర్లు చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగం గా బుధవారం అర్ధరాత్రి రిటర్నింగ్ ఆఫీసర్, పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా పేరుతో సానుభూతి కోసం వెంపర్లాడుతున్నారని అన్నా రు. ప్రజలు ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకొన్నారని, టీఆర్ఎస్కు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.