గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 05, 2020 , 18:35:46

సంకీర్త్‌ ను ఆదర్శంగా తీసుకోండి : సింగరేణి సీఎండీ

సంకీర్త్‌ ను ఆదర్శంగా తీసుకోండి : సింగరేణి సీఎండీ

మంచిర్యాల : పట్టుదల, కృషి ఉంటే ఎంతటి ఉన్నత లక్ష్యాన్నైనా సాధించవచ్చని, సింగరేణి కార్మికుడి కుమారుడు సంకీర్త్‌ తాను సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో 330 ర్యాంకు సాధించి నిరూపించాడు. అతడిని విద్యార్థులందరూ ఆదర్శంగా తీసుకోవాలని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ పిలుపునిచ్చారు. సివిల్‌ సర్వీసుకు ఎంపికైన సంకీర్త్‌కుఅభినందనలు తెలిపారు.

అలాగే బెల్లంపల్లి ఏరియాలో ఎక్స్‌ప్లోరేషన్‌ విభాగంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న అతని తండ్రి సిరిసెట్టి సత్యనారాయణకు కూడా అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని జీఎం (సీడీఎన్.) శ్రీ కె.రవిశంకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తన కుమారుడు పట్టుదలతో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాస్తుండగా సత్యనారాయణ అతనిని ప్రొత్సహిస్తూ వచ్చాడనీ, తండ్రి ప్రొత్సాహం వల్లనే నేడు సంకీర్త్‌ అతని లక్ష్యం సాధించగలిగాడని పేర్కొన్నారు. కాగా యాజమాన్యం తనను తన కుమారున్ని అభినందించడం పట్ల సత్యనారాయణ, సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపికైన సంకీర్త్‌ తమ ధన్యవాదాలు తెలిపారు.logo