హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇప్పించే విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని సమాచారశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) నేతలు వినతిపత్రం అందజేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతిసాగర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉప్పర శేఖర్ గురువారం మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. పలు జిల్లాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల చొరవతో ఇండ్ల స్థలాల సమస్య పరిషారం అయిందని, ఇంకా అనేక జిల్లాల్లో ఇండ్ల స్థలాలు రాక జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంలో తాత్సారం జరుగుతున్నదని, అర్హులను గుర్తించి ఈ సమస్యకు పరిషారం చూపాలని కోరారు. ఈ నెల 17 తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి సమస్య పరిషారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.