హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. శనివారం బీఆర్కే భవన్లో సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసిన ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలను సంబంధించిన ఆధారాలను అందజేశారు. వ్యక్తిగతంగా దూషిస్తూ, రాయలేని పదాలను ఉపయోగించిన రఘునందన్‌రావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగాలని కోరుకుంటున్నామని, కానీ రఘునందన్‌రావు ఇలా ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం తగదని అన్నారు.