హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ) : సవాలు విసరడం, తోక ముడవడం సీఎం రేవంత్‌రెడ్డికి కొత్తేమీ కాదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. రైతు సమస్యలపై దమ్ముంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎవరైనా సరే.. చర్చకు రావాలని సవాల్ విసిరిన రేవంత్‌రెడ్డి.. ఆ తర్వాత డిల్లీకి పారిపోయాడని ఎద్దేవా చేశారు.
2018లో కొండగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన ఆయన ఆ తర్వాత మాట తప్పారని దెప్పిపొడిచారు. రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌కు మాత్రమే సవాల్ చేశారని మంత్రులు భట్టివిక్రమార, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందని చెప్పారు.
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి రామాలయం ఈవో రమాదేవిపై దాడి చేయడం హేయమని తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రమ, సంఘం సలహాదారుడు సుం కరి శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భద్రాద్రి ఆలయ భూముల పరిశీలనకు ఏపీలోని పురుషోత్తపట్నానికి వెళ్లిన ఈవో రమాదేవి పై కబ్జాదారులు దాడి చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు.