చేర్యాల, జూలై 6 : సిద్దిపేట జిల్లా చేర్యాల తహసీల్దార్ దిలీప్‌నాయక్ రూ. 70 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నాగపురి గ్రామ పరిధిలోని 30 గుంటల భూమికి సంబంధించిన 11 నాలా కన్వర్షన్లకు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు.
వీటిని ప్రాసెస్ చేసేందుకు లబ్ధిదారుల నుంచి తహసీల్దార్ దిలీప్‌నాయక్ రూ. 70 వేలు డిమాండ్ చేశాడు. సోమవారం తహసీల్ ఆఫీస్‌లో లబ్ధిదారుల నుంచి లంచం తీసుకుంటుండగా తహసీల్దార్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.