హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్ ట్యూషన్ ఫీజుల సవరణపై తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) విచారణ షురూ అయ్యింది. తొలిరోజు మాసాబ్‌ట్యాంక్‌లోని టీఏఎఫ్ఆర్సీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. 19 కాలేజీల వారిని పిలవగా తొలిరోజు ఆరు కాలేజీలకు చెందిన వారే విచారణకు హాజరయ్యాయి. కొన్ని కాలేజీల వారు శివరాత్రి తర్వాత విచారణకు హాజరయ్యేందుకు అనుమతి కోరారు. ఐజా, అబ్దుల్ కలాం కాలేజీల్లో పాత ఫీజులే అమల్లో ఉండనున్నాయి.
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఐఎంసీ) ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖకు అప్పగించింది. ఇక నుంచి పాఠశాల విద్యాశాఖే నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఇదివరకు టీజీపీఎస్సీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించగా, తాము చేపట్టలేని టీజీపీఎస్సీ ప్రభుత్వానికి లేఖ రాయగా, పాఠశాల విద్యాశాఖకు అప్పగించింది. ఆర్ఐఎంసీలో 8వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రం నుంచి ఒక సీటు ఉండగా, ఏటా 100-150 మంది దరఖాస్తు చేసుకుంటున్నారు.