జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు స్వీకరిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు తాడూరి సంపత్‌కుమార్, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు పెసర ప్రభాకర్‌రెడ్డి.
– గంభీరావుపేట/ఖమ్మం ఎడ్యుకేషన్
పార్లమెంట్లో ప్రైవేట్ టీచర్ల బిల్లు పెట్టాలి
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రైవేట్ టీచర్ల సంక్షేమ బిల్లు ప్రవేశపెట్టాలని ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు శేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో 60శాతం మంది విద్యార్థులకు తక్కువ ఫీజుతో ప్రైవేట్ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందిస్తున్నట్టు తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లల్లో పనిచేస్తున్న టీచర్లు అరకొర వేతనాలతో బతుకులు వెళ్లదీసున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి రూ.10లక్షల ఆరోగ్య, జీవిత బీమా కల్పించాలని, తగిన వేతనం ఇవ్వాలని కోరారు.