ADG Shikha Goel | హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రవేశపెట్టిన టీ సేఫ్ (ట్రావెల్ సేఫ్) యాప్ ద్వారా ఒంటరిగా ప్రయాణించే మహిళలకు మరింత మెరుగైన రక్షణను కల్పిస్తున్నామని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏడీజీ శిఖాగోయెల్ తెలిపారు. గూగుల్‌లో అత్యధిక డౌన్లోడ్స్ కలిగిన యాప్‌గా టీ సేఫ్ ఉన్నదని తెలిపారు.
గడిచిన ఐదు నెలల్లో 10,958 డౌన్లోడ్స్ జరిగాయని వెల్లడించారు. డయల్ 100 ద్వారా కూడా టీసేఫ్ సేవలను పొందుతుండటంతో.. ఐదు నెలల్లో 17,263 మంది మహిళల ట్రిప్‌లను ట్రాక్ చేసినట్లు శిఖాగోయెల్ పేర్కొన్నారు.