హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి చెందిన యువ వైద్యుడు డాక్టర్ వినోద్‌కుమార్ గౌడ్ మృతిపై టీ-జూడాలు సంతాపం వ్యక్తంచేశారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షడు ఇసాక్ న్యూటన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన వినోద్ మహారాష్ట్రలోని ప్రవర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్) పీడియాట్రిక్ విభాగంలో రెండో సంవత్సరం చదువుతున్నట్టు పేర్కొన్నారు. అక్కడ పని ఒత్తిడి, వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపించారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు.
6 వరకు గేట్ దరఖాస్తులు
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్) -2026 దరఖాస్తుల గడువును ఐఐటీ గువహటి పొడిగించింది. అక్టోబర్ 6 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఈనెల 28తో గడువు ముగియగా, ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు గడువును 6 వరకు పొడిగించింది. ఆలస్య రుసుముతో 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల కోసం gate2026.iitg.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.