హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): గంజాయితోపాటు సింథటిక్ డ్రగ్స్ తెలంగాణలోకి వస్తున్నది. 2025లో ఇప్పటి వరకు 880 కేసుల్లో 1625 మందిని అరెస్టు చేశారు. 462 వాహనాలను సీజ్ చేశారు.
3,681 కిలోల గంజాయి, 66.22 కిలోల గంజాయి చాక్లెట్లు, 43.66 గ్రాముల కోకైన్, 104.3 గ్రాముల హషీష్ అయిల్, 9.61 కిలోల ఆల్పోజోలంను పట్టుకున్నారు. జూన్ నుంచి ఆగస్టు మధ్యలో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి దాదాపు రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానావాజ్ ఖాసీం పేర్కొన్నారు.