జగిత్యాల రూరల్, అక్టోబర్ 11: జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం శివారులోని కుంట చెరువులో ఉన్న విద్యుత్తు పోల్‌పై ఇన్సులేటర్ చెడిపోవడంతో రైతుల పొలాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈ విషయాన్ని రైతులు లైన్‌మన్ రాజలింగు దృష్టికి తీసుకెళ్లారు. చెరువులోని పోల్ వద్దకు వెళ్లాలంటే వేరే మార్గం లేకపోవడంతో లైన్‌మన్, అసిస్టెంట్ లైన్‌మన్ నారాయణ, విలేజ్ హెల్పర్ ముని శనివారం చెరువులో నుంచి ఈదుకుంటూ విద్యుత్తు స్తంభం వద్దకు చేరుకుని ఇన్సులేటర్కు మరమ్మతులు చేపట్టారు. సిబ్బందిని రైతులు అభినందించారు.