యాదాద్రి, జూలై 9 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి స్వయంభూ దివ్యక్షేత్రంలో శనివారం స్వాతినక్షత్ర పూజలను వైభవంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని విశేష పూజలు సం ప్రదాయరీతిలో కొనసాగాయి.
వేకువజామునే స్వయంభువులను కొలిచిన అర్చకులు ప్రధానాలయ ముఖ మండపంలో కవచమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. ముం దుగా 108 కలశాలకు పూజలు చేశారు. పంచసూక్త పఠనంతో హోమం నిర్వహించి ఉత్సవమూర్తులను, ప్రతిష్ఠ అలంకార మూర్తులను అభిషేకించారు. లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యే క పూజలు చేశారు. తిరువారాధన, బాలబోగం, స్వామివారికి నిజాభిషేకం నిర్వహించారు.