తొలి సైనిక తిరుగుబాటు 1857 కాదు 1806
1857 కంటే చాలాకాలం ముందే హైదరాబాద్లో సైనిక తిరుగుబాటు జరిగింది. 1806లో హైదరాబాద్లోని ఈస్టిండియా కంపెనీ పటాలంలో ఇది తలెత్తింది.
1857 కంటే చాలాకాలం ముందే హైదరాబాద్లో సైనిక తిరుగుబాటు జరిగింది. 1806లో హైదరాబాద్లోని ఈస్టిండియా కంపెనీ పటాలంలో ఇది తలెత్తింది. దేశీయ సైనికులు తమకిచ్చిన కొత్త యూనిఫాంలు నచ్చలేదంటూ తిరుగుబాటు చేశారు. పైకి ఇది తేలికైన కారణంతో జరిగినా దీనివెనుక గూడుకట్టుకున్న బ్రిటిష్ వ్యతిరేకత ఉంది.
యూనిఫారాలు నచ్చలేదంటూ సైనికులు తిరగబడటం అప్పట్లో ఓ సంచలనం. నిజానికి ఇలాంటి నిరసనలు హైదరాబాద్ సంస్థానానికే పరిమితం కాదు. బళ్లారి, బెంగుళూరు, నందిదుర్గ్ కంటోన్మెంట్లలో కూడా ఇదే తరహా తిరుగుబాట్లు జరిగాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని స్వదేశీ సైనికులు తమ శిబిరాన్ని వదిలిపెట్టి నిజాం అధికారులైన రాజారావ్ రంభ నింబాల్కర్, నూరుల్ ఉమ్రాల అండన చేరారు. కొత్తగా ప్రవేశపెట్టిన యూనిఫాం నచ్చకపోవడం అనేది చిన్న విషయంగా కనిపించవచ్చు. కానీ బ్రిటిష్ కంటోన్మెంట్ను ఈ సంఘటన కుదిపివేసింది.
కొత్త యూనిఫాం తమను క్రైస్తవులుగా మార్చేందుకు ఉద్దేశించిందని సైనికులు భావించడంతో గొడవ మొదలైంది. అయితే అనతికాలంలోనే రెసిడెంటు ఈ తిరుగుబాటును దారుణంగా అణచివేశాడు. అంతేకాదు సైనికులలో అవిధేయతను రెచ్చగొట్టారంటూ నింబాల్కర్, నూరుల్ ఉమ్రాలపై చర్య తీసుకోవాలని నిజాంపై రెసిడెంట్ ఒత్తిడి తెచ్చాడు. ఫలితంగా ఇద్దరిని ప్రభుత్వ పదవుల నుంచి తొలగించి ప్రవాస శిక్ష విధించారు. నైజాం ప్రాంత స్వాతంత్య్ర పోరాటంలో త్యాగాలకు ఆ విధంగా నాంది జరిగింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇరాన్పైకి ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’!
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

