నేడు వనమహోత్సవం
రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 141 మున్సిపాలిటీలు,
- స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహణ
హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 141 మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో 159 ఫ్రీడం పార్కులను ఏర్పాటు చేయనున్నారు. వీటిల్లో 72,130 మొక్కలు నాటనున్నారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 17 ఫ్రీడం పార్కులను ఏర్పాటుచేస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరిలో 14, నిజామాబాద్ జిల్లాలో 10 ఫ్రీడం పార్కులు ఏర్పాటు చేయనున్నారు.
వరంగల్ నగర పాలక సంస్థ, జమ్మికుంటలో 7,500 చొప్పున మొక్కలు నాటనున్నారు. వజ్రోత్సవాల గుర్తుగా నాటే మొక్కల సంఖ్య 75, 750, 7,500.. ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు ఉన్నతాధికారులు సూచించారు. అదేవిధంగా 75 ఆకారం వచ్చే విధంగా కూడా మొక్కలు నాటాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం మొదలైంది. విద్యార్థులకు థియేటర్లలో గాంధీ సినిమా ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి.
159 ఫ్రీడం పార్కుల ఏర్పాటు
72,130 ఫ్రీడం పార్కుల్లో నాటనున్న మొక్కలు
75 ఆకారం వచ్చే విధంగా మొక్కలు
అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 17 ఫ్రీడం పార్కుల ఏర్పాటు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

