గిరిజన హక్కులను విస్మరించద్దు.. అదే జరిగితే ఆందోళనలు అనివార్యం
ఆదివాసీల హక్కులను పాలకులు విస్మరిస్తే గిరిజన ప్రాంతాల్లో ఆందోళనలు అనివార్యమవుతాయని మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు హెచ్చరించారు. అంతర్జాతీయ ఆదివాసీ గిరిజన దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఆదివాసీల సమస్యలు, ప్రభుత్వాల వైఖరిపై విశ్లేషిస్తూ శనివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
- మాజీ గవర్నర్ విద్యాసాగర్ హెచ్చరిక
హైదరాబాద్, ఆగస్టు 8, (నమస్తే తెలంగాణ) : ఆదివాసీల హక్కులను పాలకులు విస్మరిస్తే గిరిజన ప్రాంతాల్లో ఆందోళనలు అనివార్యమవుతాయని మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు హెచ్చరించారు. అంతర్జాతీయ ఆదివాసీ గిరిజన దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఆదివాసీల సమస్యలు, ప్రభుత్వాల వైఖరిపై విశ్లేషిస్తూ శనివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
తెలుగు రాష్ర్టాల్లోని పాలకులు రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌ను కాపాడటంలో విఫలమయ్యారని ఆందోళన వ్యక్తంచేశారు. గిరిజనుల హకులు, భూమి, సంస్కృతి పరిరక్షణ కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన హైమన్‌డార్ఫ్ సేవలు, రక్తసిక్తమైన గిరిజన ఉద్యమ చరిత్రను మననం చేసుకోవాలని సూచించారు. కుమ్రం భీం పోరాడిన నేలపైనే ప్రస్తుతం 50శాతం భూములను గిరిజనేతరులు అక్రమించారని, ఇది గిరిజన దినోత్సవ ఆశయాలను భ్రష్టు పట్టించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వాలకు ముఖ్యమైన డిమాండ్లు..
ట్రైబల్ సబ్ ప్లాన్ నిధుల బదిలీ: గిరిజన ఉపప్రణాళిక (ట్రైబల్ సబ్ ప్లాన్) నిధుల నుంచి 5 శాతం నిధులను నేరుగా షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గ్రామపంచాయతీలకు బదిలీ చేయాలి.
పెసా చట్టం అమలు: పెసా చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ, చిరు అడవి ఉత్పత్తుల సేకరణ, భూసేకరణ, స్థానిక వనరుల నిర్వహణపై గ్రామసభలకు పూర్తి అధికారాలు కల్పించాలి.
యువతకు ఉపాధి: షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి (సిల్ డెవలప్మెంట్) అవకాశాలను కల్పించాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

