యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీ నారసింహ స్వామి వారిని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి స్వాత్మా నందేంద్ర సరస్వతి స్వామి వారు దర్శించుకున్నారు. గర్భగుడిలోకి స్వామి వారికి స్వరూపానందేంద్ర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం స్వామి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆ తర్వాత ప్రధానాలయ నిర్మాణాలను పరిశీలించారు. ఇవాళ మధ్యాహ్నం ఆలయం వద్దకు చేరుకున్న స్వరూపానందేంద్ర సరస్వతి స్వామికి ఆలయ అర్చకులు, ఈవో గీత పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ఉద్ఘాటన తర్వాత దర్శించుకున్న మొట్టమొదటి పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి వారు మాత్రమే.