Swachadanam-Pachadanam | హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛదనం పచ్చదనం’ మొక్కుబడిగా సాగుతున్నది. కనీస స్థాయిలో నిధులు విడుదల చే యకుండా పనులు ఎలా సాధ్యమని గ్రామ కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. కార్యక్రమం లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా పా ల్గొనడం లేదని విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు. గతంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు కచ్చితంగా నిధులు విడుదల చేసిన తరువాతే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేవారని గుర్తుచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవేవీ పట్టించుకోకుండా ప్రతిపక్షాల విమర్శలకు తలొగ్గి మొక్కుబడిగా కార్యక్రమాన్ని ప్రకటించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్వచ్ఛదనం పచ్చదనం ఈనెల 5 నుంచి 9 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. పలు పారిశుధ్య పనులు, ఇంకుడు గుంతల నిర్మాణం ప్రధాన ఎజెండా గా కార్యక్రమాన్ని రూపొందించారు. కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనేందుకూ డబ్బులు విడుదల చేయలేదని మాజీ ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు విమర్శిస్తున్నారు.
ఒక్కో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇప్పటికే లక్షల్లో అప్పుల పాలై ఉన్నారని, అదనం గా డబ్బులు పెట్టే పరిస్థితి లేదని చెప్పారు. త మ కుటుంబాలు గడవటమే కష్టంగా ఉందని, ఇంకెక్కడినుంచి డబ్బులు తేవాలని పంచాయతీ కార్యదర్శు లు ప్రశ్నిస్తున్నారు. అనేక మంది కార్యదర్శులు గతంలో పనిచేసిన పంచాయతీల నుంచి బదిలీ అయ్యామని, పాత పంచాయతీలో పెట్టిన డబ్బులు వస్తా యా? రావా? అనే ఆందోళనలో ఉన్నారు. కొత్త పం చాయతీలో డబ్బులు పెడితే వస్తాయో? రా వో?అని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పనులన్నీ చేయకపోతే అధికారులు మెమోలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.