రెంజల్, డిసెంబర్ 17 : ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి అనుమానాస్పద మృ తిపై ఉన్నతాధికారులు జ్యుడీషియల్ విచారణ చేపట్టారు. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచడంపై అనేక అనుమానా లు కలుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం ఓ తండాకు చెందిన వ్యక్తిపై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. నిందితుడిని ఈనెల 12వ తేదీ రాత్రి రెంజల్ పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్న క్రమంలోనే అతడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా దవాఖానలో చికిత్స పొందు తూ ఈనెల 13 తెల్లవారుజామున మృతి చెందాడని పోలీసులు ప్రకటించారు. అ యితే, నిందితుడు ఠాణాలోనే ఆత్మహత్య చేసుకున్నాడని, తన నడుముకు ఉండే దారంతో ఉరేసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఉన్నతాధికారులు జ్యుడీషియల్ విచారణకు ఆదేశించారు. పోస్టుమార్టం రిపోర్టు, జ్యుడీషియల్ విచారణ నివేదిక వచ్చాక సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే అవకాశమున్నది.