మెదక్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంఎల్ఎస్ పాయింట్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్టు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
మెదక్ మండలంలోని ఎంఎల్ఎస్ కేంద్రంలో బియ్యం సరఫరాలో దాదాపు రూ.5,85,67,880 నిధుల దుర్వినియోగం జరిగిందని పేర్కొన్నారు. ఎంఎల్‌ఎస్‌లో సీనియర్ అసిస్టెంట్ బీ నర్సింహులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ చిన్నగల్ల శ్రీనివాస్‌ను సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసు నమోదు చేశామని తెలిపారు.