హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ బోయినపల్లి మనోహర్ రావును సస్పెండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఓఎస్డీగా పనిచేస్తున్న వై సత్యనారాయణను విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో వీ శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి వీరు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం వీరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొన్నది. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదని పేర్కొన్నది.