Sushma Reddy | వెల్దండ, జనవరి 15 : మిసెస్ ఇండియాగా నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం రాచూర్ గ్రామానికి చెందిన సూదిని సుష్మారెడ్డి నిలిచారు. 2025 సంవత్సరానికి గాను మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఫైనల్స్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పోటీలో నిలిచిన సుష్మారెడ్డి మిసెస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. మోస్ట్ పాపులర్, మోస్ట్ డెలిగేట్స్ టైటిల్స్‌ను సైతం ఆమె దక్కించుకున్నారు. డాక్టర్ వృత్తిలో ఉన్న సుష్మా మిసెస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకోవడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.