సూర్యాపేట టౌన్, నవంబర్ 11: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాయకులు సోమవారం సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
రేవంత్‌రెడ్డి 420 హామీలిచ్చి అమలు చేయడం చేతకాక డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు.