కరీంనగర్ : భూమి కొలతల కోసం లంచం ( Bribe ) తీసుకున్న మండల సర్వేయర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. విడతల వారిగా బాధితుడు నుంచి రూ. 25 వేలు తీసుకున్న మండల సర్వేయర్ ( Surveyor ) ఎక్కలదేవి కుమార స్వామి ( Kumara Swamy ) తో పాటు, మరో ఇద్దరు ప్రైవేట్ సర్వేయర్లు తీగల రాజేశ్, వంగ విహిత్ రెడ్డిని పట్టుకున్నారు.
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం అమ్మన్‌గుర్తి గ్రామానికి చెందిన బాధితుడు తన భూమికి సంబంధించిన సర్వే చేయాలని సంప్రదించగా గత మే నెల నుంచి మూడు విడతలుగా మండల సర్వేయర్ లంచం తీసుకున్నాడు. ముగ్గురిపై కేసు నమోదు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టు ఎదుట హాజరు పరిచామని ఏసీబీ అధికారులు వివరించారు.