హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురసరించుకుని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ర్టాల్లో ప్రభుత్వ అధికారుల పనితీరుపై సర్వే చేయనున్నట్టు సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతిరహిత పాలన కోసం తమ ఫౌండేషన్ కృషి చేస్తుందని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఈ సర్వే పోస్టర్‌ను మాజీ ఎమ్మెల్యే బకని నర్సింహులు, ప్రభుత్వ రిటైర్డ్ అధికారి అశోక్‌కుమార్‌తో కలిసి ఆయన ఆ విషరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్రవంతి, గీత, స్వప్న, జీవన, కే దేవేందర్, వంశీకృష్ణ, ఎల్ రాజేశ్, నర్సింగం, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.