కొత్తగూడెం క్రైం, జూన్ 5: మావోయిస్టు పార్టీకి చెందిన ఐదుగురు హార్డ్కోర్ మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పోలీసు అధికారుల ఎదుట బుధవారం లొంగిపోయారు. పీఎల్జీఏ-1వ నెంబర్ ప్లటూన్కు చెందిన ఒక జంటతో సహా ఐదుగురు మావోయిస్టులు సరెండర్ అయ్యారు. వీరిలో సప్లయ్ టీమ్ డిప్యూటీ కమాండర్ మడకం పాండు(రూ.8 లక్షల రివార్డు), పామే డ్ ఏరియా కమిటీ సభ్యుడు, వైద్య బృందం ఇన్చార్జ్ తాటి మాసా అలియాస్ మడకం మాసా (రూ.5 లక్షల రివార్డు), 10వ నెంబర్ ప్లటూన్ ‘బీ’ సెక్షన్ కమాండర్ కొమరం దూలా(రూ.2 లక్షల రివార్డు), మడకం పాండు భార్య, పీఎల్జీఏ బెటాలియన్ 1వ నెంబర్ ప్లటూన్ సభ్యురాలు ఆడ రవ్వా(రూ.లక్ష రివార్డు), సౌత్ సబ్ జోనల్ బ్యూరో ప్రెస్ టీమ్ సభ్యుడు, పార్టీ సభ్యుడు శేఖర్ అలియాస్ ముకా సోడి(రూ.లక్ష రివార్డు) ఉన్నారు. లొంగిపోయిన ఐదుగురిపై మొత్తం రూ.17 లక్షల రివార్డును ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.