హైదరాబాద్, ఆగస్టు23 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సర్ఫేస్ మైనర్ ఇరిగేషన్ (ఎస్ఎంఐ) స్కీమ్‌ను రాష్ట్రంలో అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం టెక్నికల్ అడ్వయిజర్ కమిటీ (టీఏసీ)ని నియమించింది.
ఈ మేరకు నీటి పారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఈఎన్సీ జనరల్ అనిల్‌కుమార్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, మైనర్ ఇరిగేషన్ సీఈ కన్వీనర్‌గా కొనసాగనున్నారు.