వరంగల్, జూన్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేవాదాయ మంత్రి కొండా సురేఖ తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి సురేఖ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హనుమకొండ జిల్లాకు సంబంధించి పోలీసు పరేడ్ గ్రౌండ్లో సోమవారం జరిగిన ఆవిర్భావ దినోత్సవానికి మంత్రి సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జిల్లా ప్రగతి ప్రసం గం సమయంలో మంత్రి సురేఖ తడబడ్డారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి బదులుగా గణతంత్ర దినోత్సవం అని పలకడంతో అక్కడ ఉన్నవారంతా నవ్వుకున్నారు. సురేఖ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.