ఎమ్మెల్సీగా వాణీదేవి ప్రమాణస్వీకారం
ఎమ్మెల్సీ వాణీదేవి| పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన సురభి వాణీదేవి ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలిలోని తన చాంబర్లో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి.. వాణీదేవితో ప్రమాణం చేయించారు.

హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన సురభి వాణీదేవి ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలిలోని తన చాంబర్లో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి.. వాణీదేవితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేకే కేశవరావు, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభి వాణీదేవి.. గత మార్చిలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజక వర్గానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాంచందర్రావుపై విజయం సాధించారు. వాణీదేవికి 1,89,339 ఓట్లురాగా, బీజేపీ అభ్యర్థికి 1,37,566 ఓట్లు పోలయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

