హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): సంచలనం సృష్టించిన న్యాయవాది గట్టు వామన్‌రావు దంపతుల హత్యపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని ఆయన కుమారుడు కిషన్‌రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సుందరేశ్, ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.
ప్రస్తుతం నిందితులంతా బెయిల్‌పై ఉన్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసును సీబీఐ లేదా సీఐడీతో విచారణ జరిపించేందుకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు చెప్పారు. దీంతో నిందితులను కూడా ప్రతివాదులుగా చేర్చి వారికీ నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.