సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణ విషయం లో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుర్తుచేశారు. తీర్పును అమలు చేయడానికి అవసరమైన అని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కోరారు.సుప్రీంకోర్టు తీర్పులో ఎస్సీలలో మరింత వెనుకబడిన కులాలకు విడివిడిగా కోటాలు ఇచ్చుకోవడానికి అనుమతించడం సానుకూల అంశమని పేర్కొన్నారు. హైదరాబాద్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీలోని వెనుకబడిన కులాలను విధాన నిర్ణయాల పరిధిలోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. వర్గీకరణ ద్వారా వచ్చే రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వర్తింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు. బీసీల్లో కూడా అత్యంత వెనుకబడిన కులాలు (ఎంబీసీ) కడు పేదరికం అనుభవిస్తున్నాయని, రిజర్వేషన్ల ఫలితాలు అన్ని తరగతులకు దకాలంటే బీసీల్లోనూ వర్గీకరణ చేపట్టాలని సూచించారు.