హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీ ఉమ్మడి ప్రాజెక్టులను రివర్ బోర్డులకు అప్పగించాలన్న కేంద్రం గెజిట్ను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది.
జలవిద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన జీవో 34ను రద్దుచేయాలని ఏపీ సర్కార్ కూడా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్లు జస్టిస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. ఒకే ధర్మాసనం విచారించే అంశాన్ని సీజేఐ ముందుపెట్టి, అనుమతి తీసుకోవాలని సూచిస్తూ విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.