హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో నిర్మిస్తున్న నూతన సచివాలయంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు జరిపించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు చుక్కెదురైంది. దేశంలో జరిగే అగ్నిప్రమాదాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలా? అంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు చీవాట్లు పెట్టింది. సచివాలయ ప్రమాదంపై చేసుకోలేమని స్పష్టం చేసింది. పాల్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమంటూ కొట్టేసింది.