Supreme Court | నష్టం పూడ్చకపోతే సీఎస్ జైలుకెళ్లాల్సిందే.. కంచ గచ్చబౌలి భూముల వ్యవహారంలో ‘సుప్రీం’ కీలక వ్యాఖ్యలు..!
Supreme Court | కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం కీలక వ్యాఖలు చేసింది. పర్యావరణ నష్టం పూడ్చకపోతే సీఎస్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించిన ధర్మాసనం హెచ్చరించింది.
Supreme Court | కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం కీలక వ్యాఖలు చేసింది. పర్యావరణ నష్టం పూడ్చకపోతే సీఎస్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించిన ధర్మాసనం హెచ్చరించింది. సీఎస్‌తో పాటు కార్యదర్శులు జైలుకు పోవాల్సి ఉంటుందని చెప్పింది. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిందేనని.. పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? లేదా? స్పష్టం చేయాలని జస్టిస్ బీఆర్ గవాయ్ ఆదేశించింది. లాంగ్ వీకెండ్ చూసి ఎందుకు చెట్ల తొలగింపు పనులు చేపట్టారని మరోసారి ధర్మాసనం ప్రశ్నించింది. నష్టాన్ని పూడ్చేందుకు తీసుకునే చర్యలు స్పష్టంగా చెప్పాలని ఆదేశించింది. కేంద్ర సాధికార సంస్థ నివేదికపై కౌంటర్ దాఖలుకు తెలంగాణ ప్రభుత్వం సమయం కోరింది. ఈ సందర్భంగా విజిల్ బోయర్స్, విద్యార్థులపై కేసుల విషయాన్ని ప్రస్తావించిన న్యాయవాదులు కోర్టు ఎదుట ప్రస్తావించారు. కేసులు కొట్టివేయాలని అప్లికేషన్ దాఖలు చేశామన్న న్యాయవాదులు తెలిపారు. అయితే, ఈ పిటిషన్‌తో కలిసి విచారించడం కుదరదని.. కేసులు కొట్టివేయాలన్న అప్లికేషన్స్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. అవసరమైతే మరో పిటిషన్ వేయాలని కోర్టు సూచించింది. కంచగచ్చబౌలి భూముల వ్యవహారంపై విచారణను జులై 23వ తేదీకి వాయిదా వేసింది.
హెచ్‌సీయూలో 120 ఎకరాల్లో చెట్ల కూల్చివేత విధ్వంసంపై సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని మే 15 వరకు పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కోర్టు విచారణ జరిపింది. హెచ్‌సీయూలో విధ్వంసానికి సంబంధించిన వివరాలన్నింటిని పరిశీలించడానికి ఏప్రిల్ 10న సెంట్రల్ ఎంవపర్డ్ కమిటీ హెచ్‌సీయూ విధ్వంసాన్ని పరిశీలించింది. అక్కడి విద్యార్థి సంఘాల నాయకుల అభిప్రాయాలు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, రాజకీయ నాయకుల ఒపీనియన్స్ సైతం సేకరించింది. కాగా, అక్కడ జరిగింది విధ్వంసమే.. చెట్లు, జంతువులకు తీవ్ర నష్టం వాటిల్లిందని నివేదికను ఏప్రిల్ 15న కమిటీ సుప్రీం కోర్టుకు సమర్పించింది. అదే రోజు ప్రభుత్వం సైతం నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు కోరింది. ఇదే సమయంలో మే 15 వరకు మీరు హెచ్‌సీయూ అడవుల్లో కూల్చిన చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. గతంలో విచారణ సమయంలోనూ తెలంగాణ ప్రభుత్వం సరైన నివేదిక ఇవ్వాలని.. అలా ఇవ్వకపోతే సీఎస్‌ను జైలుకు పంపాల్సి వస్తుందని హెచ్చరించిన విషయం విధితమే. చెట్లను నాటడానికి ఏ విధమైన పద్ధతులను అనుసరిస్తారో చెప్పాలంటూ సూచించింది. ఈ విషయంలో ప్రభుత్వం, సీఎస్‌ను ఎవరినీ కూడా ఉపేక్షించబోమని హెచ్చరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

