హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం జారీచేసిన జీవో 46పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఆ జీవో బాధితులను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వాడుకుని వదిలేయడం దుర్మార్గమని పిటిషనర్, బీఆర్ఎస్ నేత రాకేష్‌రెడ్డి వాదించారు. 23 సార్లు అవకాశమిచ్చినా కౌంటర్ దాఖలు చేయకలేదని, వారికి వెంటనే న్యాయం చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాది స్పందిస్తూ.. కౌంటర్ దాఖలుకు రెండు నెలల గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. వచ్చే నెల 28లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ ప్రభు త్వం కుట్రలకు పాల్పడుతున్నదని ఏనుగుల రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జనగామ జిల్లా ఎర్రగుంట తండాలో ఆదివారం జరిగిన లాఠీచార్జి కాంగ్రెస్ వికృత రాజకీయకు అద్దం పడుతున్నదని మండిప్డడారు.ప్రజలు తిరగబడ్డ నాడు లాఠీలు, తూటాలు ఆపలేవని హెచ్చరించారు.