హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ల నియామకం కోసం ప్రతిపాదనలు పంపడంలో అనేక రాష్ట్రాలు చేస్తున్న తీవ్ర జాప్యం పట్ల సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. తాతాలిక డీజీపీలను ఇంకా ఎంతకాలం నియమిస్తారని ఆగ్రహం వ్యక్తంచేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తూ జరిపే నియామకాలను తమ దృష్టికి తీసుకురావడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కి అవకాశం కల్పించింది. తెలంగాణకు డీజీపీని సిఫారసు చేయడానికి యూపీఎస్సీకి నాలుగు వారాల గడువు ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు జనవరి 9న ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ యూపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. 2018 నాటి ప్రకాష్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డీజీపీల నియామకానికి ప్రతిపాదనలు పంపడంలో అనేక రాష్ట్రాలు తీవ్ర జాప్యం చేస్తున్నాయంటూ యూపీఎస్సీ ఆందోళన వ్యక్తం చేయడంపై ధర్మాసనం సా నుకూలంగా స్పందించింది. రాష్ట్రాలు సకాలంలో ప్రతిపాదనలు సమర్పించకపోతే, ప్రకాష్‌సింగ్ కేసును రిఫర్ చేస్తూ తమ దృష్టికి తీసుకురావాలని యూపీఎస్సీకి ఆదేశాలు జారీచేసింది.
పోలీసు సంసరణలకు సంబంధించిన ప్రకాష్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. దీని ప్రకారం యూపీఎస్సీ ఎంప్యానెల్ చేసిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల నుంచి డీజీపీలను ఎంపిక చేయాలి, వారికి రెండేండ్ల స్థిర ఉద్యోగకాలాన్ని ఇవ్వాలి. కానీ రాష్ట్రాల వైపు నుంచి జరుగుతున్న జాప్యం వల్ల, డీజీపీగా నియామకానికి అర్హత ఉన్న, సీనియర్ అధికారులను పరిగణనలోకి తీసుకోవడం లేదని యూపీఎస్సీ తరపు సీనియర్ న్యాయవాది నరేశ్కౌశిక్ చెప్పారు. పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టు ఆదేశాలను పూర్తిగా విస్మరిస్తున్నాయని తెలిపారు. రెగ్యులర్ నియామకానికి బదులుగా తాతాలిక డీజీపీని నియమిస్తున్నాయని చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ప్రకాష్‌సింగ్ కేసు లో జారీచేసిన ఆదేశాలను ఏ రాష్ట్ర ప్రభుత్వ మూ ధికరించడానికి వీల్లేదని, సకాలంలో ప్రతిపాదనలు పంపాల్సిందేనని, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే యూపీఎస్సీకి లేఖలు రాయాలని స్పష్టం చేసింది.
తెలంగాణకు డీజీపీ ఎంపిక ప్రక్రియ మొత్తాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రకాష్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన కాలపరిమితిలోగా తెలంగాణ సరార్ ప్రతిపాదన పంపలేదని, తీవ్ర జాప్యం చేసిందని నరేశ్కౌశిక్ కోర్టు దృష్టికి తెచ్చారు. తెలంగాణలో చివరి రెగ్యులర్ డీజీపీని నవంబర్ 2015లో నియమించారని, ఆ అధికారి నవంబర్ 2017లో ఉద్యోగ విరమణ చేశారని చెప్పారు. అప్పటినుంచి తాతాలిక డీజీపీలే ఉంటున్నారని తెలిపారు. దీనివల్ల పలువురు సీనియర్ ఐపీఎస్‌లు ఉద్యోగోన్నతి లేకుండా ఉద్యోగ విరమణ చేస్తున్నారని యూపీఎస్సీ తెలిపింది. ఖ్యానించింది. తెలంగాణ రాష్ట్రానికి డీజీపీ నియామకం కోసం వీలైనంత త్వరగా సిఫారసు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ఈ సిఫారసులపై యూపీఎస్సీ త్వరగా ప్యానెల్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఇందుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది.