ప్రైవేట్ వ్యక్తి దాఖలు చేసిన కేసులో వెలువడిన హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేయడం గమనార్హం
– సుప్రీంకోర్టు
హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్‌రావును ఫోన్‌ట్యాపింగ్ కేసులో విచారణకు అనుమతించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖ లు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హరీశ్‌రావుతోపాటు మాజీ డీసీ పీ రాధాకిషన్‌రావుపై ప్రభుత్వం దాఖలు చేసి న వేర్వేరు అప్పీళ్లను సోమవారం డిస్మిస్ చేసిం ది. తన ఫోన్‌ట్యాపింగ్ చేయించారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంగ్రెస్ నాయకుడు చక్రధర్‌గౌడ్ చేసిన ఫిర్యాదు మేరకు హరీశ్, రాధాకిషన్‌రావుపై పంజాగుట్ట పోలీసులు న మోదు చేసిన కేసులను గత ఏడాది మార్చి 20న తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భూయాన్ ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ కేసులో హరీశ్‌రావు తరఫున న్యాయవాది పీ మోహిత్‌రావు వాదనలు వినిపించారు.
ఒకే కేసులో మరో ఎస్ఎల్పీ ఎలా వేస్తారు?
క్రిమినల్ పిటిషన్లో ఒక ధర్మాసనం తీర్పు వెలువరించాక అదే తరహాలో అదే కేసులో ప్రభుత్వం (పోలీసులు) ఇప్పుడు మరో ఎస్ఎల్పీని ఎలా దాఖలు చేస్తుందని ధర్మాసనం ప్ర శ్నించింది. ఒక అభియోగానికి చెందిన కేసులో రెండు వేర్వేరు తీర్పులను ఎలా ఆశిస్తారని నిలదీసింది. ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీ ని కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది. హైకోర్టు అన్ని విషయాలను విచారించాకే తీర్పు వెలువరించిందని, ఈ తీర్పులో జోక్యం చేసుకునేందుకు ఆసారం లేదని స్పష్టంచేసింది. రాధాకిషన్‌రావు ద్వారా హరీశ్‌రావు.. చక్రధర్‌గౌడ్ ఫోన్‌ను ట్యాపింగ్ చేయించారని ప్రభుత్వం తరఫున సీనియర్ సిద్ధార్థ లూథ్రా వాదించా రు. హైకోర్టులోని పిటిషన్, ఉత్తర్వులను ఒకసారి పరిశీలించాలని ఆయన కోరగా ధర్మాసనం తిరసరించింది. స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)లో జోక్యం చేసుకునేందుకు ఏమీ లేదని తేల్చి చెబుతూ తీర్పు వెలువరించింది.
హైకోర్టు తీర్పును ఆమోదించిన ధర్మాసనం
హరీశ్‌రావు, రాధాకిషన్‌రావుపై నమోదైన కేసులో అభియోగాలకు అనుగుణంగా ఆధారాలు, కారణాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ‘గత ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి హరీశ్‌రావు, చక్రధర్‌గౌడ్ పోటీ చేశారు. చక్రధర్‌గౌడ్ ఫిర్యాదుల్లో రాజకీయ శత్రుత్వం కనిపిస్తున్నది. దీనికితోడు ఫిర్యాదు చేయడంలో అసాధారణ జాప్యానికి కారణా లు కూడా వివరించలేదు. డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులోగానీ, పైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఆరోపణలకు ఒక ఆధారం చూపలేదు. కేసు నమోదుకు కారణాలు, ఆధారాలు ఏమీ లేవు. కాబట్టి పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ చెల్లదు’ అని తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
హరీశ్‌రావుపై అభియోగాలేవి?
హరీశ్‌రావు విశ్వాసఘాతుకానికి పాల్పడిన ట్టు లేదా నేరపూరిత బెదిరింపులకు పాల్పడిన ట్టు ఆరోపణలు చేయలేదని సుప్రీంకోర్టు ఎత్తిచూపింది. డీజీపీకి 2024జూన్ 18న చక్రధర్ ఇచ్చిన వినతిపత్రంలో, హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో, 2024 డిసెంబరు 1న పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దోపిడీ, బెదిరింపులు, నమ్మకద్రోహం, నేరపూరిత చర్యలకు ఎలాంటి ఆరోపణలు చేయలేదని వివరించింది. ఆరోపణలన్నీ ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించినవేనని తేల్చింది. నేరపూరిత చర్యలు, బెదిరింపులకు సంబంధించిన ప్రస్తావన లేనేలేదని స్పష్టం చేసింది. చక్రధర్‌గౌడ్‌ను బెదిరించి డబ్బులు, ఆస్తులు వసూలు చేసినట్టు హరీశ్‌రావుపై ఏ విధమైన అభియోగాలూ లేవని, కాబట్టి ఐపీసీ సెక్షన్ 386 కింద ఎఫ్ఐఆర్ నమోదు చెల్లదని తేల్చింది. ఐసీసీ 409 సెక్షన్ కింద ప్రజాప్రతినిధి హోదాలో ప్రభుత్వ ఆస్తి దుర్వినియోగ అభియోగాలు కూడా హరీశ్‌రావుపై లేవని తెలిపింది.
ఎస్ఎల్పీ దాఖలు గమనార్హం..
‘రాధాకిషన్‌రావుపై నమోదైన ఫోన్‌ట్యాపింగ్ కేసులో 60వ సాక్షిగా చక్రధర్‌గౌడ్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలోని విషయాలతోనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశా రు. పలు కేసుల్లో అరెస్టయిన చక్రధర్‌ను పోలీసులు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చినప్పుడు రాధాకిషన్‌రావు వేధించినట్టుగా కింది కోర్టు లో చెప్పలేదు. చక్రధర్‌గౌడ్ తన ఫోన్ట్యాపిం గ్ జరిగిందంటూ పంజాగుట్ట పోలీసులకు చేసి న ఫిర్యాదులోని అభియోగాలకు, ఆధారాలు ల్లేవు..’ అని కూడా హైకోర్టు తన తీర్పులో పేరొన్నదని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తుచేసింది. ప్రైవేట్ వ్యక్తి దాఖలు చేసిన కేసులో వెలువడిన హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేయడం గమనార్హమని పేర్కొంది.