నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో 10 నెలల నుంచి రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న ఎస్ఐబీ అదనపు ఎస్పీ తిరుపతన్నకు జైలు నుంచి విముక్తి లభించింది. తిరుపతన్నకు సోమవారం సుప్రీంకోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేయడంతో మంగళవారం ఆయన కింది కోర్టులో జమానత్‌లను సమర్పించారు.
తిరుపతన్న తరఫున ఆయన న్యాయవాది లక్ష చొప్పున ఇద్దరి పూచీకత్తులను 14వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించడంతోపాటు నిందితుడి పాస్‌పోర్టును కోర్టుకు స్వాధీనం చేశా రు. అనంతరం తిరుపతన్న చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.