Meenakshi Natarajan: సుప్రీంకోర్టులో శుక్రవారం మీనాక్షి నటరాజన్ కేసు విచారణ
Meenakshi Natarajan: రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై మీనాక్షీ నటరాజన్ సుప్రీంను ఆశ్రయించారు. తక్షణమే తన పిల్‌పై విచారణ చేపట్టాలని కోరారు. అయితే శుక్రవారం ఆ కేసులో విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది. మీనాక్షీ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదిస్తున్నారు.
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) రాజ్యసభకు దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై తక్షణమే విచారణ చేపట్టాలని మీనాక్షి ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటీషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టనున్నట్లు ఇవాళ సుప్రీంకోర్టు వెల్లడించింది. మీనాక్షీ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదిస్తున్నారు. తప్పుడు రీతిలో మీనాక్షి నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఆయన కోర్టుకు తెలిపారు. కానీ రాజ్యసభ ఎన్నిక ప్రక్రియ ముగిసిన తర్వాతే ఎలక్షన్ పిటీషన్ నమోదు చేయాలని మీనాక్షికి సుప్రీంకోర్టు చెప్పినట్లు తెలుస్తోంది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఏఎస్ చందూర్కర్తో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణకు ఆమోదించింది.
మధ్యప్రదేశ్‌లో మూడు రాజ్యసభ సీట్ల కోసం జూన్ 18వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అయితే మంగళవారం అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ అరవింద్ శర్మ అకస్మాత్తుగా మీనాక్షీ నటరాజన్ పిటీషన్‌ను తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి జలక్ తగిలింది. మీనాక్షి అసంపూర్ణంగా డాక్యుమెంట్లు సమర్పించిన అరవింద్ శర్మ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. తనపై కోర్టు కేసు ఉన్న విషయాన్ని ఆమె ఫామ్ 26లో పొందుపరచలేదని ఆర్వో తెలిపారు.
2025 అక్టోబర్‌లో హైదరాబాద్ కోర్టుకు నోటీసుకు నటరాజన్ స్పందించారని, కానీ ఫామ్ 26లో ఈ విషయాన్ని చెప్పలేదని రిటర్నింగ్ ఆఫీసర్ తెలిపారు. తెలంగాణలో మీనాక్షీపై కేసు నమోదు అయ్యిందని బీజేపీ అభ్యర్థి మహేశ్ కేవత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జూన్ 8వ తేదీన నామినేషన్ ఫైలింగ్‌కు చివరి తేది. మంగళవారం రోజున ఆ పేపర్లను స్క్రూటినీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

