కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని పాదయాత్ర
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం గూరకొండకు చెందిన చిన్న నరసింహ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఇటీవల గ్రామం నుంచి పాదయాత్ర చేపట్టాడు. శనివారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకొని కేసీఆర్‌ను కలిశారు.
మూసాపేట(దేవరకద్ర), అక్టోబర్ 31 : మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం గూరకొండకు చెందిన చిన్న నరసింహ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఇటీవల గ్రామం నుంచి పాదయాత్ర చేపట్టాడు. శనివారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకొని కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా చిన్న నరసింహ మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయానికి సాగునీరు, విద్యుత్తు సరఫరా, యూరియా, పెట్టుబడి సాయం, విద్య, వైద్య సేవలు అందుబాటులో ఉండేవని, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మళ్లీ మంచి రోజులు రావాలంటే మళ్లీ కేసీఆర్ సారె ముఖ్యమంత్రి కావాలని కోరుతూ పాదయాత్ర చేపట్టినట్టు తెలిపాడు.
సిరిసిల్ల నుంచి వేములవాడకు పాదయాత్ర
సిరిసిల్ల టౌన్, అక్టోబర్ 31: తెలంగాణకు కేసీఆర్ మరోసారి సీఎం కావాలని ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు శనివారం సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌక్ నుంచి వేములవాడ రాజన్న ఆలయానికి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా రవిగౌడ్ మాట్లాడుతూ.. రాజన్న ఆశీస్సులతో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్న ఆకాంక్షతోనే పాదయాత్ర చేపట్టినట్టు తెలిపారు.

Brs
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

